తణుకు అర్బన్: తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఈనెల 17న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ కమ్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ (ఉమెన్) ఎంపిక ట్రయల్స్‌లో (2026–27 విద్యా సంవత్సరానికి గాను) తమ కళాశాల విద్యార్థినులు ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ యూఎల్ సుందరీబాయ్ తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థినులు బి.పురందేశ్వరి, ఎం.కీర్తన, డి.చంద్రలేఖ, కేవీఎస్ విజయలక్ష్మి, ఎం. అమూల్య ప్రథమ స్థానంలో నిలిచారని వివరించారు. వీరిలో పురందేశ్వరి, కీర్తన వచ్చే నెల 9 నుంచి విజయవాడలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విజేతలైన విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పరిశీలకులు డాక్టర్ కె.బాలసత్యనారాయణ, డాక్టర్ బి.బాపిరెడ్డి, ఎస్‌డీ నాగిని, విశ్వవిద్యాలయ ఫిజికల్ డైరెక్టర్ ఎం.రత్నకుమారి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.


