ఏలూరు (ఆర్ఆర్పేట): దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) ఆధ్వర్యంలో వైఎస్సార్ నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో బుధవారం బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బడి వెలుపల ఉన్న పిల్లలు, తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థులు, డంపింగ్ యార్డు వద్ద అపరిశుభ్ర వాతావరణంలో జీవిస్తున్న పిల్లల సమస్యలపై అవగాహన కల్పించారు. జీజేఏ స్టీవెన్ మాట్లాడుతూ విద్య, పోషకాహారం, ఆరోగ్యం, భాగస్వామ్యం, ఆటపాటలు, వినోదం వంటి బాలల ప్రాథమిక హక్కులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఏరియా కోఆర్డినేటర్ యామిని మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాశాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగాల అనుమతితో డీబీఆర్సీ ఈ సదస్సులు నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాధురి తదితరులు పాల్గొన్నారు.


