ద్వారకాతిరుమల: ప్రజల మద్దతు వైఎస్సార్‌సీపీకే ఉందని, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని మాజీ హోంమంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వ నిత అన్నారు. మండలంలోని తిరుమలంపాలెంలో సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు కూరపాటి మధు, నంబూరి అజయ్, మోట్రు పవన్, సాతునూరి సురేష్, బంటుమల్లి రమేష్, పెనుబోయిన రమేష్, ఏపూరి నాగరాజు, కూచిపూడి లక్ష్మణరావులు ఆమె ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె వీరికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. మండలంలో ఈనెల 29న జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థు విజయానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొప్పన నరసింహరావు, షేక్ మస్తాన్ బాష, జంగా వెంకటకృష్ణారెడ్డి, చిలకా సతీష్, ఆకుర్తి సత్యన్నారాయణ, గోనబోయిన సత్యనారాయణ, చందు గౌడ్, చెరుకూరి కొండలరావు, గంజి గాంధి, పల్లి ప్రసాద్, కొత్తపల్లి ప్రభాకరరావు, తిరుపతిరావు, బంటుమిల్లి బాలకృష్ణ, గదుల మహేష్, చిలకా రమేష్, ముస్సే శ్రీను, మోటూరి శ్రీను తదితరులు ఉన్నారు.


