స్కేటింగ్ క్రీడాకారుల ప్రతిభ
ఏలూరు ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందిన పలువురు స్కేటింగ్ క్రీడాకారులు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చారు. పతకాలతో సత్తాచాటారు. 8లో u
కై కలూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పెలికాన్ పక్షులు విడిది చేసే ఏకై క ప్రాంతం మండలంలోని ఆటపాక పక్షుల విహార కేంద్రం. అందుకే దీనిని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. శీతాకాలపు వలస పక్షులతో కేంద్రం కళకళలాడుతుండగా.. పర్యాటకులు వీక్షణ కోసం వస్తున్నారు. ఇదే సమయంలో పక్షుల కేంద్రం గట్లపై తాగిపడేసిన మద్యం సీసాలను చూసి పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ ఆటపాక పక్షుల కేంద్రం వద్ద రాత్రి గస్తీ నిర్వహించలేకపోవడం, నిర్మానుష్య ప్రాంతం కావడం, లైట్లు లేకపోవడంతో మందుబాబులు దీనిని అడ్డాగా మార్చుకున్నారు. ఆటపాక పక్షుల కేంద్రం గట్టు నుంచి కోమటిలంక చేరే దారిలో మద్యం సీసాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. తాగేసిన సీసాలను కొల్లేరులో విసిరేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.


