బాలల హక్కులపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కులపై అవగాహన తప్పనిసరి

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

బాలల హక్కులపై అవగాహన తప్పనిసరి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బాలల హక్కులపై ప్రతిఒక్కరు అవగాహనా కలిగి ఉండాలని, బాల్య వివాహాలను ప్రోత్సహించకూడదని, ప్రోత్సహించిన వా రికి శిక్ష ఉందని జిల్లా శిశు సంరక్షణ అధికారి సీహెచ్‌ సూర్యచక్రవేణి అన్నారు. స్థానిక నరసింహరావు పేటలోని డీసీపీఓ కార్యాలయంలో దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో బాలల హక్కుల వా రోత్సవాలపై ముద్రించిన వాల్‌ పోస్టర్లను సోమ వారం ఆమె ఆవిష్కరించారు. దళిత బహుజన రీసో ర్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో 8 రకాల పోస్టర్లు ముద్రించడం అభినందనీయమన్నారు. ఈనెల 14 నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈనెల 20 వర కూ కొనసాగిస్తామని డీబీఆర్‌సీ ప్రతినిధులు బలే సురేష్‌, గోశాల ఝాన్సీ రాణి, బలిరెడ్డి యామిని తెలిపారు. డీసీపీయూ సిబ్బంది ఎస్‌.సునీత, సీ హెచ్‌ మాధవీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement