చింతలపూడి పీఠంపై ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

చింతలపూడి పీఠంపై ఉత్కంఠ

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

పట్టణ వ్యూ

చింతలపూడి: జిల్లాలో నగర పంచాయతీగా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలే చింతలపూడి రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. నగర పంచాయతీలో మొత్తం 22,738 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,942 మంది పురుషులు, 11,792 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. చైర్‌పర్సన్‌ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే నామినేషన్ల పర్వం మొదలై గడువు ముంచుకొస్తున్నా ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవడం పట్టణంలో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ముఖ్యంగా అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపికపై జరుగుతున్న సాగదీత క్షేత్రస్థాయి కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలై రెండు రోజులు గడుస్తున్నా, కూటమి అభ్యర్థి ఎవరనే దానిపై అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ‘కష్టకాలంలో పార్టీ జెండాను భుజాన మోసి, అడుగడుగునా అండగా నిలిచింది మేమైతే.. తీరా అధికారం వచ్చాక సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలం పేరుతో కొత్తగా వచ్చిన వారికో, డబ్బు కట్టలు తెచ్చిన వారికో పీఠం కట్టబెట్టాలని చూడటం ఎంతవరకు సమంజసం?’ అంటూ తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. కష్టపడిన కార్యకర్తలకు మొండిచేయి చూపితే భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసే వారే కరువవుతారనే హెచ్చరికలు క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తున్నాయి.

ప్రచారంలో వెనుకబడే ప్రమాదం

ఒకవైపు ప్రత్యర్థి పార్టీ అంతర్గతంగా ప్రచార వ్యూ హాలకు పదును పెడుతుంటే, అధికార కూటమిలో మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికపైనే మల్లగుల్లాలు పడుతుండటంపై స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లకు తుది గడువు దగ్గరపడుతున్న వేళ ఈ జాప్యం వల్ల క్షేత్రస్థాయిలో వెనుకబడే ప్రమాదం ఉందని కార్యకర్తలు మండిపడుతున్నారు.

రాత్రికి తెరపడేనా..?

నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఆశావహులు ఎవరి స్థాయిలో వారు అధిష్టానం వద్ద తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. అటు కూటమి, ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు ఈ రాత్రికి అభ్యర్థుల ఎంపికను ఒక కొలిక్కి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి నగర పంచాయతీ పీఠాన్ని కై వసం చేసుకునే క్రమంలో ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయి? అసంతృప్తుల సెగ ఎవరికి నష్టం చేకూరుస్తుంది? అనేది చింతలపూడి పట్టణంలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

కూటమిలో అసంతృప్తి సెగ

అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం

డబ్బు కట్టలకే ప్రాధాన్యమంటూ ‘తమ్ముళ్ల’ ఆగ్రహం

ఆశావహుల్లో వీడని టెన్షన్‌

తొలి నగర పంచాయతీ ఎన్నికల్లో వీడని పీఠముడి

చింతలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement