ద్వారకాతిరుమల : మద్దులగూడెం గ్రామంలో టీడీపీ సీనియర్ నేత గంజి బాలస్వామి ఆదివా రం వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షుడు చెలికాని ప్రవీణ్ ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం జరిగింది. మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌సీపీ గో పాలపురం నియోజకవర్గ ఇనన్‌చార్జి తానేటి వ నిత బాలస్వామికి పార్టీ కండువా కప్పి సా దరంగా ఆహ్వానించారు. ఈనెల 29న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున టీడీపీ అభ్యర్థిపై బాలస్వామి పోటీ చేయనున్నట్టు వనిత ప్రకటించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఏలూరు జిల్లాలో చింతలపూడి నగర పంచాయతీ, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు బీ–ఫారంలు జారీ చేసే అధికారిక ప్రతినిధి లేఖలు ఫారం–ఏను వైఎస్సార్ సీపీ ప్రతినిధులు ఆదివారం కలెక్టరేట్‌లో డీఆర్వో రవీందర్‌కు అందజేశారు.
కైకలూరు : కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజాదికాలు నిర్వహించారు. ఈవో కూచిపూడి శ్రీనివాసు ఏర్పాట్లను పర్యవేక్షించి మాట్లాడుతూ దేవస్థానానికి పలురూపాల్లో రూ.14,275 ఆదాయం వచ్చిందన్నారు.
జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం) : గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం సువర్చలా హనుమద్ కల్యాణం జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వామి వారి గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది.
గణపవరం : మండలంలోని పిప్పరకు చెందిన ఉద్దరాజు సాన్వివర్మ రాష్ట్రస్థాయి అండర్–11 బ్యాడ్మింటన్ రన్నర్స్ కప్ పో టీల్లో విజేతగా ని లిచింది. విజయవాడలోని సాయిసందీప్ స్టేడియంలో జ రిగిన పోటీల్లో గెలి చి కప్, మెడల్, ప్ర శంసా పత్రాన్ని అందుకున్నట్టు ఆమె తండ్రి రామ్‌నరేష్ తెలిపారు. పిప్పరలో ఐదో తరగతి చదువుతున్న సాన్వివర్మ బ్యాడ్మింటన్ శిక్షణ కోసం కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటోంది. విజేతను మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఐ.రామకృష్ణంరాజు తదితరులు అభినందించారు.
కై కలూరు : లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంతో చేపల చెరువు కాపలాదారుడు మృతి చెందిన ఘటన సింగాపురం వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కై కలూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన కూతడ శ్రీను సింగాపురంలో ఎండీ ఆరీఫ్ చేపల చెరువుపై భార్య ఏసురత్నంతో కలిసి కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఆ దివారం గోనెపాడు వద్ద మాంసం తీసుకుని ద్విచక్రవాహనంపై తిరిగి శ్రీను ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని 108లో కై కలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు ఏసురత్నం ఫిర్యాదుతో ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


