వైఎస్సార్‌సీపీలోకి మండల ప్రధాన కార్యదర్శి
కొయ్యలగూడెం: పోలవరం నియోజకవర్గంలో జ నసేన పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొయ్యలగూడెం మండల ప్రధాన కార్యదర్శి గొలిశెట్టి శ్రీనివాస్, ఆయన భార్య లక్ష్మి తమ అనుచరులతో సహా వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆదివారం గొలిశెట్టి కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గోలిశెట్టి దంపతులు చేరిక బీసీ వర్గాల్లో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని బాలరాజు అన్నారు. కుమ్మరి భద్రం వారి ఉమ్మడి కుటుంబానికి పరిసర ప్రాంతాల్లో అభిమానాన్ని గుర్తించి పరింపూడి సర్పంచ్ అభ్యర్థిగా గోలిశెట్టి లక్ష్మిని నిలబెడుతున్నామని బాలరాజు పేర్కొన్నారు. ఆమె గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కృషిచేసిన తనకు, తన భార్యకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీరని ద్రోహం చేశారని అవమానాలు పడుతూనే కొనసాగామని గొలిశెట్టి దంపతులు తెలిపారు. బీసీలకు సముచిత స్థానం వైఎస్సార్‌సీపీలోనే ఉందని స్పష్టం అయిందన్నారు. కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ నూకల రాము, మాజీ ఎంపీపీ గంజిమాల రామారావు, నాయకులు మేకల అన్నవరం, గొలిశెట్టి ప్రసాద్, జుంగా బాబ్జి, చిటికెన నాగార్జున, బొబ్బర యేసు, గోలిశెట్టి సత్యనారాయణ, ఏలూరి శ్రీను, మానేపల్లి రామకృష్ణ, చించుల పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.


