విష్ణు ఉమెన్స్‌ వర్సిటీ సువర్ణాధ్యాయం | - | Sakshi
Sakshi News home page

విష్ణు ఉమెన్స్‌ వర్సిటీ సువర్ణాధ్యాయం

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

భీమవరం: భీమవరం విద్యాచరిత్రలో విష్ణు ఉమెన్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు సువర్ణాధ్యాయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ, డాక్టర్‌ బి.వి. రాజు ఫౌండేషన్‌ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆదివారం భీమవరం విష్ణు క్యాంపస్‌లో విష్ణు కాన్‌ఫ్లూయెన్స్‌ – మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు విశేషంగా కృషిచేసిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మను చైర్మన్‌ విష్ణురాజు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, జేసీ కె.ఆర్‌.కల్పశ్రీ, ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి, ఎమ్మెల్యేలు రామాంజనేయులు, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement