శ్రీవారి కొండపై ట్రక్కు ఆటో బోల్తా | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి కొండపై ట్రక్కు ఆటో బోల్తా

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై నుంచి వేగంగా కిందకు వస్తున్న ఓ ట్రక్కు ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటన ఆదివారం సాయంత్రం స్థానిక శివాలయం ఆర్చిగేటు కూడలి వద్ద చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెంకు చెందిన కేటరింగ్‌ వ్యాపారులు కొండపై జరిగిన ఒక వివాహ వేడుకకు వంటకాలు సరఫరా చేసి, పనులు ముగించుకుని ట్రక్కు ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆర్చిగేటు కూడలి వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఆ సమయంలో అటుగా ఇతర వాహనాలు ఏవీ రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు బాలురు, ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించగా, అనంతరం వారంతా అదే ఆటోలో తిరిగి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement