వైభవంగా గుప్తా అవార్డుల ప్రదానోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా గుప్తా అవార్డుల ప్రదానోత్సవం

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గుప్తా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్‌ఏ హాల్‌లో అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. శత వసంతాల వయోలిన్‌ కళాకారుడు పద్మశ్రీ అన్నవరపు రామస్వామికి గుప్తా అవార్డును ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మడుపల్లి మోహనగుప్తా, మల్లీశ్వరి దంపతులు ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక అందజేశారు. అలాగే వైద్య రంగంలో ఆరు దశాబ్దాల పాటు సేవనందిస్తున్న 92 ఏళ్ల డాక్టర్‌ సూరి శ్రీమతికి రూ. 5 లక్షల నగదు పురస్కారం, జ్ఞాపికతో పాటు సత్కరించారు. శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని సాహితీ పరిశోధకురాలు ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహేకు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అన్నవరపు రామస్వామి, కర్ణాటక గాత్ర విద్వాంసుడు మోదుమూడి సుధాకర్‌, డాక్టర్‌ సూరి శ్రీమతిలను సీనియర్‌ జర్నలిస్ట్‌ గుండు వల్లీశ్వర్‌, డాక్టర్‌ కాత్యాయని విద్మహేను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వంగల సంపత్‌ రెడ్డి పరిచయం చేశారు. అనంతరం అన్నవరపు రామస్వామి శిష్య బృందం ప్రదర్శించిన శాసీ్త్రయ సంగీత కచేరి సభికులను అలరించింది. ఆడిటర్‌ డి.వి. సుబ్బారావు సమన్వయకర్తగా వ్యవహరించగా ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, గుప్తా సంస్థల ప్రతినిధి కె. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్‌ సూరి శ్రీమతి

కాత్యాయని విద్మహే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement