19 నుంచి శోభనాచల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

19 నుంచి శోభనాచల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

19 నుంచి శోభనాచల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొబ్బరి చెట్టుపై నుంచి జారిపడి కార్మికుడి మృతి

ఆగిరిపల్లి: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, కృత్తిక దీపోత్సవాలను ఈ నెల 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్‌.సాయి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 19న అంకురార్పణ, 21న శ్రీవారి శోభనగిరి ప్రదక్షిణ, 22న కొండపై స్వామివారు వెలసిన మూడు గుళ్ల వద్ద శాంతి కల్యాణం నిర్వహిస్తారు. 23న దివ్య తిరుకల్యాణం, గరుడ వాహనోత్సవం, 24న ప్రధాన ఘట్టమైన అవభృథోత్సవం, చక్రస్నానం, సాయంత్రం కోవెల వద్ద కృత్తిక దీపోత్సవం ఉంటాయని వివరించారు. వీటితో పాటు నిత్య సుప్రభాత సేవ, హోమాలు, సాయంకాలార్చనలు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు.

పెదవేగి: మండలంలోని రామసింగవరంలో విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొప్పవానిపేటకు చెందిన గుంపా లక్ష్మణరావు (49) కొబ్బరికాయలు దించేందుకు ఆదివారం ఉదయం రామసింగవరం వచ్చారు. స్థానికంగా కడప బాలబాలాజీకి చెందిన తోటలో కొబ్బరికాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధి కోసం తమతో పాటు వచ్చిన సహచరుడు విగతజీవిగా మారడంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement