ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలు స్థానిక జీఎంసీ బాలయోగి సైన్స్ పార్క్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మొత్తం 108 ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 7 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. జిల్లా సైన్స్ అధికారి ఎస్‌వీఎస్ సోమయాజులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త స్వర్ణ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అకడమిక్ కోఆర్డినేటర్ కె. ఫణీంద్ర పావని, గైడ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు
వీ. కుమార్ అజయ్ (విజయరాయి జెడ్పీ హైస్కూల్), ఆర్. యశ్వంత్ సాయి సూర్య (శనివారపుపేట జెడ్పీ హైస్కూల్), ఎం. హిమశ్రీ (తడికలపూడి జెడ్పీ హైస్కూల్), ఎం. నాగదేవి కుమారి (పెదనిండ్రకొలను జెడ్పీ హైస్కూల్), జీ. గగన అక్షయ (కొయ్యలగూడెం ఆగ్జిలియం ఇంగ్లీష్ మీడియం స్కూల్), జీఆర్‌కే రిత్విక్ (చిత్తపూరు జెడ్పీ హైస్కూల్), ఎం.రాజేశ్వరి (ఎం.సురవరం జెడ్పీ హైస్కూల్).


