న్యూస్‌రీల్
రూ.60 లక్షల నష్టం
నారుకు డిమాండ్
ఆదివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2026
బుట్టాయగూడెం: పొగాకు రైతులకు వరుస తుపాన్లు శాపంగా మారాయి. ఒడిదుడుకులతో సాగు చేపట్టిన రైతుల ఆశలను ఛిన్నాభిన్నం చేశాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తొలుత అర్నబ్ తుపాను ప్రభావాన్ని నిలదొక్కుకున్న పొగాకు తోటలను మురసు తుపాను ముంచేసింది. భారీ వర్షాలతో వచ్చిన వరద ప్రవాహానికి ఇసుక మేటలు వేయడం, పల్లపు ప్రాంతాల్లో భూములు కోతకు గురికావడంతో సాగుకు అనుకూలంగా లేకుండా తయారయ్యాయి. ఇసుక మేటలు వేసిన పొలాల్లో మళ్లీ పొగాకు మొక్కలు బతికించడం కష్టమని రైతులు వాపోతున్నారు. అలాగే ప లు గ్రామాల్లో దెబ్బతిన్న పొగాకు తోటలను ట్రాక్టర్ తో దున్ని వేస్తూ మళ్లీ మొక్క నాటుతున్నారు.
5 వేలం కేంద్రాల పరిధిలో..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాల పరిధిలో ఈ ఏడాది సుమారు 6,400 ఎకరాల్లో రైతులు పొగాకు తోటలు వేయగా సుమారు 4,500 ఎకరాలకు పైగా పంట దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు.
ట్రాక్టర్‌తో దున్నేస్తూ..
పొగాకు పంట కళ్లముందే నీట మునిగిపోవడంతో రైతులు కుంగిపోయారు. అయినా ఏమాత్రం వెనుకాడకుండా నష్టపోయిన పంటను ట్రాక్టర్లతో దున్నేసి మళ్లీ కొత్తగా పొగాకు నాట్లు వేస్తున్నారు. మళ్లీ అప్పు చేసి అదే ఆశతో పొలంబాట పట్టారు.
పంట నష్టం రూ.50 కోట్ల పైనే..
ఉమ్మడి జిల్టాలో సుమారు రూ. 50 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.లక్షకు పైగా పంటలకు పెట్టుబడి పెట్టామని పంటలు వేసి 40 రోజులు గడిచిందని పంట ఎదుగుదల చూసి దిగుబడులు బాగుంటాయని ఆశిస్తున్న తరుణంలో తుపాను ఉసూరు మనిపించిందని వాపోతున్నారు.
తుపాను హెచ్చరికలతో..
మరో తుపాను (అక్వాన్) హెచ్చరికలు పొగాకు రైతులను మరింత కలవరపెడుతున్నాయి. కష్టనష్టాలకోర్చి సాగు చేస్తున్న పంట మరలా దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. వరుసగా ఎదురవుతున్న వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఆర్థిక భారంగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
అమ్మో తుపాను
తుపాను హెచ్చరికలతో పొగాకు రైతుల గుబులు
ఇప్పటికే వరుస తుపాన్లతో పంటకు దెబ్బ
భారీ వర్షాలతో 4,500 ఎకరాల్లో నష్టం
దెబ్బతిన్న పంటను దున్నేస్తూ.. మళ్లీ మొక్క నాటుతున్న రైతులు
నేను సుమారు 100 ఎకరాల్లో పొగాకు పంట వేశారు. 40 రోజుల పాటు పంట ఎదిగింది. ఎరువులు, మందులకు పెట్టుబడులు కూడా పెట్టగా.. పంట ఆశాజనకంగా ఉందని భావిస్తున్న సమయంలో మురసు తుపాను ముంచేసింది. భారీ వర్షాలకు వచ్చిన వరదతో సుమారు 70 ఎకరాల్లో పంట దెబ్బతింది. పంట పాడైపోవడంతో ట్రాక్టర్‌తో దున్ని మళ్లీ మొక్కలు నాట్లు వేయిస్తున్నాను. సుమారు రూ.60 లక్షల వరకూ నష్టపోయా.
– సయ్యద్ బాజీ, వర్జీనియా పొగాకు రైతు,
అచ్చియ్యపాలెం, బుట్టాయగూడెం మండలం
తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పొగాకు తోటలు కొట్టుకుపోవడంతో మళ్లీ తోటలు వేయడానికి నారు కొరత ఏర్పడింది. తుపానుకు మందు ఎకరా నారు (6 వేల మొక్కలు) రూ.4 వేల నుంచి రూ.4,500 ధర ఉండగా ప్రస్తుతం రూ.16 వే లు ధర పలుకుతోంది. మా పొలంలో సుమారు 30 ఎకరాల్లో పొగాకు నారు పెంచగా.. 15 ఎక రాలు వర్షాలకు కొట్టుకుపోయింది. మిగిలిన నా రు కుళ్లిపోయింది. నాకు కూడా నారు దొరకని పరిస్థితి.
– ఎన్‌ఎస్‌వీ వెంకట్రావు, పొగాకు రైతు,
కండ్రికగూడెం, బుట్టాయగూడెం మండలం


