పంట నష్టం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పంట నష్టం పరిశీలన

Nov 15 2026 1:02 PM | Updated on Nov 15 2026 1:02 PM

పంట నష్టం పరిశీలన డీఆర్వోగా రవీందర్‌ ఓపీఎస్‌కు దరఖాస్తు చేసుకోండి రెగ్యులరైజ్‌ చేయాలి ఎన్‌సీఈఆర్‌టీ శిక్షణకు ఎంపిక

దెందులూరు: ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే వరి వంగడాలను రైతులు సాగుచేసేలా అవగాహన కలిగించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి వ్యవసాయ శాఖ జేడీ హబీబ్‌ బాషాకు ఆదేవించారు. మండలంలోని పోతునూరులో తుపానుతో దెబ్బతిన్న పొలాలను శనివారం ఆమె పరిశీలించారు. స్వర్ణ రకం అధిక దిగుబడి ఇస్తున్నా వైపరీత్యాల సమయంలో మొక్క వాలిపోయి రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. వర్షాలకు స్వర్ణ రకాలు ఎక్కువగా దెబ్బతిన్నాయన్నారు. విపత్తులను తట్టుకునేలా 1318, 1121, పీఎల్‌ 1100 రకాలపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని కోరారు. జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనిల్‌కుమారి, మండల వ్యవసాయ అధికారి ఎల్‌. శ్రీనివాసరాజు ఉన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా రెవెన్యూ అధికారిగా జి.రవీందర్‌ శనివారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. రవీందర్‌ గతంలో పోలవరం డీఆర్వోగా పనిచేసి అనంతరం రంపచోడవరం మొబైల్‌ కోర్ట్‌లో సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వం ఇక్కడ నియమించింది. కలెక్టరేట్‌లోని సూపరింటెండెంట్లు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 2003 డీఎస్సీ ద్వారా ఎంపికై 2004 సెప్టెంబర్‌ 1 కంటే ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. సంబంధిత డీడీఓ సంతకంతో దరఖాస్తు సమర్పించాలని, 2003 డీఎస్సీ నియామక ప్రకటన, తుది ఎంపిక జాబితా, ప్రాథమిక నియామక ఉత్తర్వులు, విధుల్లో చేరిన ఉత్తర్వుల ప్రతులు (సంబంధిత డీడీఓ కౌంటర్‌ సంతకంతో), సర్వీస్‌ రిజిస్టర్‌ మొదటి ఐదు పేజీలు దరఖాస్తుతో జత చేయాలన్నారు. వీటిని ఈనెల 19లోపు మండల విద్యాశాఖాధికారులు లేదా డీడీఓలకు సమర్పించాలని సూచించారు.

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, ఎన్‌ఎంఆర్‌ల సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని, అప్పటివరకూ కనీస వేతనం రూ.35 వేలు ఇచ్చేలా 12వ పీఆర్సీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చే యాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ది జోనల్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.అప్పలరాజు, కోశాధికారి బి.నారాయణరావు విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక కోటదిబ్బ వద్ద సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గత పీఆర్సీ బేసిక్‌పేకి రెట్టింపు ఇవ్వాలని, ఐఆర్‌ 30 శాతం చెల్లించాలని, నాలుగేళ్ల సరెండర్‌ లీవు, పెండింగ్‌ డీఏలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ 12వ పీఆర్సీ కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు.

నిడమర్రు: దక్షిణ భారత రాష్ట్రాల ఉపాధ్యాయులకు ఎన్‌సీఈఆర్‌టీ ఆ ధ్వర్యంలో నిర్వహించే సామర్థ్య అభివృద్ధి శిక్షణకు మండలంలోని చానమిల్లి జెడ్పీ హైస్కూల్‌ గణిత ఉపాధ్యాయుడు బురడా వెంకటకృష్ణ ఎంపికై నట్టు ఎంఈఓలు అనూరాధ, శేషగిరిరావులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా.. రాష్ట్రం నుంచి వెంకటకృష్ణ ఒకరన్నారు. ఆయన 2025 డీఎస్సీలో ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికై ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. వెంకటకృష్ణ మాట్లాడుతూ విద్యారంగంలో ప్రతిభ, అంకితభావాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement