వీరాలమ్మకూపులో పులి మకాం | - | Sakshi
Sakshi News home page

వీరాలమ్మకూపులో పులి మకాం

Nov 15 2026 1:02 PM | Updated on Nov 15 2026 1:02 PM

బుట్టాయగూడెం: పశ్చిమ మన్యంలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో పెద్దపులి భయం వెంటాడుతూనే ఉంది. జిల్లెళ్లగూడెం సమీపంలో ఎద్దుపై దాడి చేసి అదే ప్రాంతంలో మకాం వేసిన పెద్దపులి శనివారం బొత్తప్పగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో సంఘం వాగు సమీపంలో ఉన్న వీరాలమ్మకూపు వద్ద మకాం వేసినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే రాత్రి సమయానికి పులి సంచారం ఎటువైపు ఉంటుందో అని అధికారులు అంచనా వేస్తున్నారు. సమీపంలోని రాచన్నగూడెం, అంకన్నగూడెం, లంకాలపల్లి గ్రామాలతో పాటు బుట్టాయగూడెం మండలంలోని బెడదనూరు, రెడ్డిగణపవరం, జగ్గిశెట్టిగూడెం, సూరపువారిగూడెం, నాగులగూడెం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంగారెడ్డిగూడెం రేంజ్‌ అధికారి దుర్గాకుమార్‌బాబు ఆధ్వర్యంలో పులి ఎటువైపు వెళుతుందో, ఎక్కడ సంచరిస్తుందో తెలుసుకునేలా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా పులిని బంధించేందుకు రాజమండ్రి నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ రెస్క్యూ బృందం కూడా రంగంలోకి దిగింది. పులికి ఎటువంటి హాని కలగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పులిని సురక్షితంగా బంధించేందుకు అదికారులు ప్రణాళికలు ఏర్పాటు చేశారు. అలాగే పరిసర ప్రాంత ప్రజలను, పశువుల కాపరులను అడవిలోకి వెళ్లవద్దని, రాత్రి వేళల్లో బయటకు రావద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.

రంగంలోకి ఆర్‌ఆర్‌ఆర్‌ రెస్క్యూ బృందం

బొతప్పగూడెం అటవీ ప్రాంతంలో రెస్క్యూ బృందం

వీరాలమ్మకూపు అటవీప్రాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement