చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శని వారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. సీఐ క్రాంతి కుమార్‌తో కలిసి కౌంటింగ్ కేంద్రం వద్ద కల్పించిన బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరు, మూడంచెల భద్రతా ఏర్పా ట్లను తనిఖీ చేశారు. నిరంతర నిఘా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బంది డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్సై సతీష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు.
తొలిరోజు రెండు నామినేషన్లు
నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా.. రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్‌తో పాటు 23 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా నగర పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్ల స్వీకరణ కౌంటర్లను ఏర్పాటు చే శారు. 13వ వార్డు స్థానానికి ఇద్దరు అభ్యర్థులు నా మినేషన్ వేసినట్టు అధికారులు తెలిపారు.


