పెదవేగి: స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో శనివారం నుంచి రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి కె.జయరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పోటీలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని వెల్లడించారు
తణుకు అర్బన్: రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో తణుకుకు చెందిన 2వ తరగతి విద్యార్థిని జి. హన్వి ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఇటీవల తాడేపల్లిగూడెంలో మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె రెండో స్థానంలో నిలిచింది. దీని ద్వారా వచ్చే ఏడాది జనవరిలో జరిగే జాతీయ స్థాయి చదరంగం పోటీలకు అర్హత సాధించినట్లు తల్లి మమతా యాదవ్ తెలిపారు.
దేవరపల్లి: దొంగతనం కేసులో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఎస్సై ఆంజనేయబాబు తెలిపిన వివరాల ప్రకారం నల్లజర్ల మండలం దూబచర్లలోని సెల్ఫోన్ షాపులో 2018లో జంగారెడ్డిగూడేనికి చెందిన పోలవరపు నాగ దుర్గాప్రసాద్, తాడేపల్లి చిట్టిబాబు దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై అప్పట్లో నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో తాడేపల్లిగూడెం ఫస్ట్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.లలితాదేవి శుక్రవారం నిందితులకు 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు.


