ఏలూరు (టూటౌన్): జనాభా గణనను కచ్చితత్వంతో నిర్వహించేలా సిబ్బందికి పూర్తి అవగాహనతో శిక్షణ అందించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జనాభా గణనపై రాష్ట్ర జనాభా గణన శాఖ అధికారులు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఆమె హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ శిక్షణలో అందించే ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన క లిగి ఉండాలని, ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవాలన్నారు. మూడు రోజుల పాటు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనగణన–మొదటి దశలో గృహాలకు సంబంధించిన వివరాలు సేకరించగా, రెండో దశలో దేశంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా వివరాలను 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి ద్వారా నమోదు చేయనున్నట్టు తెలిపారు. శిక్షణ పొందిన ఫీల్డ్ ట్రైనర్లు జిల్లాలోని సూపర్వైజర్లు, ఎ న్యూమరేటర్లకు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి శి క్షణ అందజేయాలన్నారు. రాష్ట్ర జనగణన శాఖ జేడీ జగన్నాథం, మాస్టర్ ట్రైనర్ కృష్ణ వేణిని కలెక్టర్ సత్కరించారు. ఇన్‌చార్జి డీఆర్వో ఎం. ముక్కంటి అధికారులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు తెలిపారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీల ఎంపికలను నిర్దేశిత తేదీల్లో నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
మెరుగైన సేవలందించాలి
ప్రజలకు రెవెన్యూ సేవలందించడంలో జిల్లాను రాష్ట్రంలో ముందుస్థానంలో ఉంచేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. రీసర్వే, మ్యుటేషన్లు, 22ఏ కేసులు పరిష్కారం, ఆర్‌ఓఆర్, పీజీఆర్‌ఎస్ తదితర అంశాలపై జేసీ అభిషేక్ గౌడ తో కలిసి డివిజన్ స్థాయి అధికారులు, తహసీల్దార్లతో సమీక్షించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): భారీ వర్షాలు, అర్నబ్ తుపాను ప్రభావంతో సెప్టెంబర్ 23, 24, 25 తేదీలతో పాటు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో కాంపన్‌శాటరీ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రాబోయే రెండో శనివారాల్లో పాఠశాలలు తెరవాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 14, వచ్చేనెల 12, ఫిబ్రవరి 13, మార్చి 13వ తేదీల్లో పాఠశాలలు తెరిచి తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
నరసాపురం రూరల్: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. మండలంలోని తూర్పుతాళ్లు సర్పంచ్ పదవి జనరల్ కావడంతో పోటీ పెరిగింది. రాత్రి వేళ గ్రామ దేవత సమక్షంలో గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. ఓ అభ్యర్థి రూ.50 లక్షలు ఇస్తానని.. మరో అభ్యర్థి ఎకరా భూమి గ్రామ దేవత పేరున రాస్తానని.. ఇంకొకరు గుడి కట్టిస్తానంటూ చెప్పారు. అయితే నిబంధనల మేరకు అభ్యర్థులు నడుచుకోవాలని, షరతులు వర్తిస్తాయని గ్రామ పెద్దలు చెప్ప డం గమనార్హం. నామినేషన్ల ఉపసంహరణ చివరి తే దీన మరోసారి సమావేశం నిర్వహించుకుని వేలం ఖరారు చేద్దామని నిర్ణయించడం కొసమెరుపు. ఏ కగ్రీవాల పేరుతో ఇలా బలవంతపు వేలం పాటలు నిర్వహించడం తగదని ప్రజాస్వామ్యవాదులు అభి ప్రాయ పడుతున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: జిల్లాలో ధాన్యం కొ నుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంచుతామని జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ అన్నారు. గురువారం కుంచనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ ఎం.సూర్యారావుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. వర్షాలకు రంగు మారిన ధాన్యం, 33 శాతం కన్నా ఎక్కువ దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించి కొనుగోలు చేస్తామన్నారు.


