గోవులకు గర్భశోకం | - | Sakshi
Sakshi News home page

గోవులకు గర్భశోకం

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

రోడ్డు ఇలా.. ప్రయాణమెలా?

న్యూస్‌రీల్‌

మనుషులకూ సోకే అవకాశం

తొలి అడుగు శ్రీవారి దేవస్థానానిదే..

రోడ్డు ఇలా.. ప్రయాణమెలా?
ఉండి జంక్షన్‌ నుంచి ప్రారంభమయ్యే ఉండి– గణపవరం స్టేట్‌ హైవే (232) ప్రయాణికులు, వాహనదారుల పాలిట మృత్యుపాశంగా మారింది. 8లో u

మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి గోసంరక్షణ శాలలోని గోవులపై బ్రూసెల్లోసిస్‌ వ్యాధి పంజా విసిరింది. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో 71 గోవులకు వ్యాధి నిర్ధారణ కావడంతో దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి సోకిన గోవులను వేరు చేసి ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యాధి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పాడి రైతులను సైతం కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి భారీగా వ్యాపించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాడి పశువుల్లో గర్భస్రావం తదితర సమస్యలపై రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.

358 గోవులకు పరీక్షలు : గోసంరక్షణశాలలోని ఆవులకు తరచూ గర్భస్రావం జరుగుతున్న విషయాన్ని గమనించిన ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు విషయాన్ని మండల పశువైద్యాధికారి అంగర సురేష్‌తో చర్చించారు. దీంతో ప్రత్యేక వైద్య బృందం మొత్తం 358 గోవుల నుంచి రక్తం, ఇతర నమూనాలను సేకరించి విజయవాడ పంపించగా 71 గోవులకు బ్రూ సెల్లోసిస్‌ వ్యాధి నిర్ధారణ అయ్యింది. వీటిలో 68 ఆవులు, 3 గిత్తలు ఉన్నాయి. దీంతో వాటిని గోసంరక్షణశాల వెనుక ఉన్న వాకింగ్‌ ట్రాక్‌ ప్రాంతానికి తరలించి ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు.

భారీ షెడ్ల నిర్మాణం : వ్యాధి నిర్ధారణ అయిన గోవులకు ప్రత్యేక వసతులు కల్పించేందుకు తిమ్మా పురంలోని దేవుడి తోటలో భారీ షెడ్లను నిర్మిస్తున్నారు. మంచినీటి తొట్టెల నిర్మాణం పూర్తయింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాధి సోకిన గోవులను మిగిలిన పశువుల నుంచి వేరుగా ఉంచడంతోపాటు, వాటి సంరక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు.

గర్భస్రావం ప్రధాన లక్షణం

బ్రూసెల్లోసిస్‌ (బ్రూసెల్లా) బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. పశువుల్లో ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గర్భధారణ చివరి దశలో గర్భస్రావం, మృతదూడల జననం, బలహీనమైన దూడలు, మాయ బయటకు రాకపోవడం, వంధ్యత్వం వంటి సమస్యలు కనిపించవచ్చు. పునరుత్పత్తి అవయవాలపై తీవ్ర ప్రభావం పడితే మళ్లీ గర్భం దాల్చలేని పరిస్థితి. అలాగే పాల ఉత్పత్తిపైనా దీర్ఘకాల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎద్దుల్లో వృషణాల వాపు, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం లేదా వంధ్యత్వం సంభవించవచ్చు.

వేటికి సంక్రమిస్తాయంటే..

బ్రూసెల్లోసిస్‌ ప్రధానంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు తదితర పశువులకు సోకుతుంది. గర్భస్రావం జరిగినప్పుడు వెలువడే గర్భద్రవాలు, మాయ, ఇతర స్రవాల్లో బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇవి పరిసరాలను కలుషితం చేసి వ్యాధిని వ్యాపింపజేస్తాయి.

మేత తింటున్న వ్యాధి సోకిన గోవులు

తిమ్మాపురంలో షెడ్ల నిర్మాణం

బ్రూసెల్లోసిస్‌ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోటిక్‌ వ్యాధి. గర్భద్రవాలు, మాయ, ఇతర స్రవాలను తాకడం ద్వారా సంక్రమిస్తుంది. వ్యాధిగ్రస్తు పశువు ఇచ్చే పచ్చిపాలు లేదా పాశ్చరైజ్‌ చేయని పాల ఉత్పత్తులు కూడా ప్రమాదకరమే. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, చలి, అధికంగా చెమటలు పట్టడం, నీరసం, తలనొప్పి, కండరాలు–కీళ్ల నొప్పులు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపవచ్చు. ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

రాష్ట్రంలో గోవులకు బ్రూసెల్లోసిస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించిన తొలి దేవస్థానంగా ద్వారకాతిరుమల నిలిచింది. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం గోసంరక్షణశాలలో నూ ఈ వైద్య పరీక్షలు నిర్వహించగా.. సు మారు 600 గోవులకు ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు సమాచారం.

బ్రూసెల్లోసిస్‌ పంజా

శ్రీవారి గోసంరక్షణ శాలలోని గోవుల్లో వ్యాధి నిర్ధారణ

ప్రత్యేక సంరక్షణకు అధికారుల చర్యలు

తిమ్మాపురంలో భారీ షెడ్ల నిర్మాణం

తరచూ గర్భస్రావాలతో వెలుగులోకి..

ఉమ్మడి జిల్లాలోని పాడి రైతుల్లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement