అవసరమైన పత్రాలు
ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి
మరింత మంది ఎంపికయ్యేలా..
గణపవరం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపకార వేతన పరీక్ష (నేషనల్ మీన్స్‌కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్))కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2008 నుంచి ఈ పథకం కింద ఎనిమిదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రతిభ చాటిన వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున నాలుగేళ్లపాటు రూ.48 వేల ఆర్థిక సాయం అందిస్తారు.
అర్హులు వీరే.. ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులు. ఏడో తరగతిలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు, ఇతరులు 55 శాతం మార్కులు సాధించాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 3.50 లక్షలకు మించి ఉండరాదు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. నవోదయ, కేంద్రీయ, ప్రైవేటు విద్యాలయాల విద్యార్థుల అనర్హులు. పరీక్ష ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50.
పరీక్ష విధానం : పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తారు. పరీక్ష రెండు విభాగాలుగా మొత్తం 180 ప్రశ్నలకు మూడు గంటల వ్యవధి. మెంటల్ ఎలిజిబిలిటి టెస్టు (మ్యాట్) 90 ప్రశ్నలకు 90 మార్కులు, స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్) 90 ప్రశ్నలకు 90 మార్కులు. 7, 8 తరగతుల సిలబస్ నుంచి గణితం (20 మార్కులు), సైన్స్ (35 మార్కులు), సోషల్ (35 మా ర్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతిభ చూపితే 9, 10 తరగతులు, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వరకూ ఉపకార వేతనం ఇస్తారు. మధ్యలో చదువు మానివేసినా, ప్రైవేటు విద్యాసంస్థలో చేరినా వారికి స్కాలర్‌షిప్ నిలిపివేస్తారు. ఏటా విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నట్లు హెచ్‌ఎం తప్పనిసరిగా ధ్రువీకరించాలి.
ఆదరణ బాగుంది
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆదరణ పెరిగింది. గణపవరం మండలంలో ముప్పర్తిపాడు యూపీ పాఠశాల విద్యార్థులు వరుసగా ఐదేళ్లు ఉపకార వేతనానికి ఎంపిక కావడం విశేషం. నాలుగేళ్లుగా గణపవరం, నిడమర్రు మండలాల్లోని హైస్కూళ్ల నుంచి సుమారు 100 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గతేడాది ఉంగుటూరు నియోజకవర్గం నుంచి 26 మంది విద్యార్థులు ఎంపిక కావడం విశేషం.
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, 7వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు సమర్పించాలి.
పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ కలెక్ట్ లింక్ ద్వారా చెల్లించాలి.
దరఖాస్తులకు అక్టోబర్ 12 వరకు, ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 13 వరకు గడువు ఉంది.
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
వచ్చేనెల 12 వరకు గడువు
నాలుగేళ్లపాటు ఏడాదికి
రూ.12 వేల చొప్పున స్కాలర్‌షిప్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సువర్ణావకాశం
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాయడానికి విద్యార్థులను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ప్రోత్సహించి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా సూచించాం. గతేడాది పెదనిండ్రకొలను హైస్కూల్ నుంచి తొమ్మిది మంది, నిడమర్రు హైస్కూల్ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఎక్కువ మంది ఎంపికయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
– తైలం అనూరాధ, ఎంఈఓ–1 నిడమర్రు
మా హైస్కూల్ నుంచి గతేడాది ఆరుగురు విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది కనీసం పది మంది ఎంపికయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా సోషల్ ఉపాధ్యాయుడు ఎల్.ప్రసాదరావు ఎన్‌ఎంఎంఎస్ విద్యార్థులకు పాఠశాల సమయం ముగిశాక, సెలవు రోజుల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
– పుప్పాల సూర్యప్రకాశ్, హెచ్‌ఎం, జల్లికొమ్మర, గణపవరం మండలం
2025–26లో ఎంపికై న విద్యార్థులు
జిల్లా దరఖాస్తులు ఎంపికై నవారు
పశ్చిమగోదావరి 4,223 162
ఏలూరు 3,470 151


