ఏలూరు కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

ఏలూరు కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

ఏలూరు టౌన్‌: ఏలూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో భారీగా నగదు కుంభకోణం, ప్రజల పన్నులు, కార్పొరేషన్‌ షాపుల అద్దెలు, ఇతర ఆర్థికపరమైన రూ.కోట్ల ప్రజాధనం లూటీ చేశారంటూ వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగింది. సోమ వారం స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ నాయకత్వంలో పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌ మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్‌కు 150 ఏళ్ల ఘన చరిత్ర ఉందనీ, ఎన్నడూ లేనివిధంగా ప్రజల సొమ్ము స్వాహా చేశారని విమర్శించారు. ప్రజలు కట్టిన సొమ్ముకు జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా పథకం ప్రకారం కాజేశారని ఆరోపించారు. రూ.కోట్లలో నగదు కుంభకోణం జరిగినట్టు తమకు అనుమానాలు ఉన్నాయనీ, జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. ఇందుకు ఆద్యు డు ఏలూరు నగర కమిషనర్‌గా భావిస్తున్నామనీ, వెన్నుపోటు ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలో ప్రజలు చెల్లించిన పన్నులను దిగమింగారని ఆరోపించారు. ప్రస్తుతానికి రూ.70 లక్షలు నగదు దారిమళ్లినట్టు చెబుతున్నారనీ, ఇంకా ప్రజాధనం ఎంత ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేసి ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు.

కలెక్టర్‌కు వినతిపత్రం : ప్రజల సొమ్ము దోపిడీపై సమగ్ర విచారణ జరిపించాలని జయప్రకాష్‌, నాయకులు కలెక్టర్‌ వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు. దోపిడీదారుల నుంచి ప్రజల సొమ్ము రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రెండేళ్ల కాలంలో లావాదేవీలపై ఆడిట్‌ చేయించాలని, విజిలెన్స్‌, సీఐడీ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళ అధ్యక్షురాడు జిజ్జువరపు విజయనిర్మల, నాయకులు చిలకపాటి డింపుల్‌, ఇనపనూరి కేదారేశ్వరి, కిలాడి దురా్గారావు, ఇనపనూరి జగదీష్‌, గంటా మోహనరావు, గేదెల సూర్యప్రకాష్‌, మోటమర్రి సదానందకుమార్‌, కొల్లిపాక సురేష్‌, బుద్దాల రాము, పసుపులేటి దినేష్‌, సాసుపల్లి యుగంధర్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement