స్ఫూర్తిప్రదాత గురజాడ | - | Sakshi
Sakshi News home page

స్ఫూర్తిప్రదాత గురజాడ

Sep 22 2026 1:06 AM | Updated on Sep 22 2026 1:06 AM

స్ఫూర్తిప్రదాత గురజాడ పాత పెన్షన్‌ కోసం వినతి మరో ముగ్గురు సస్పెన్షన్‌ 25న నులిపురుగుల నివారణ కార్యక్రమం అంతర్జాతీయ స్పేస్‌ ప్రోగ్రామ్‌కు జస్వంత్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నవయుగ వైతాళికుడు, ఆధునిక తెలుగు సాహిత్య దిక్సూచి, సంఘ సంస్కర్త, అభ్యుదయ కవి గురజాడ స్ఫూర్తిప్రదాత అని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్‌లో గురజాడ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యం, సామాజిక చైతన్యానికి ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమ న్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, అసిస్టెంటు కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో ఎం.ముక్కంటి పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ అమలుకు విధివిధానాలను విడుదల చేయాలని ఫైనాన్స్‌ సెక్రటరీ వినయ్‌ చంద్‌ను ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, బసవ లింగారావు, సబ్‌ కమిటీ సభ్యులు బి.రెడ్డిదొర, కోనంకి అశోక్‌కుమార్‌, నాటూర్‌ రవికుమార్‌, మక్కెన శ్రీనివాసరావు బృందం సచివాలయం వెలగపూడిలో కలిసి ప్రాతినిధ్యం చేసినట్టు రెడ్డిదొర ఏలూరులో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మార్గదర్శకాలను వారం లోపు విడుదల చేస్తామని ఫైనాన్స్‌ సెక్రటరీ హామీ ఇచ్చారన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం బిల్లుల సొమ్మును ప్రతి నెలా విడుదల చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరపాలక సంస్థ షరాఫ్‌ కౌంటర్‌లో రూ.70 లక్షలు మా యం చేశారన్న ఆరోపణలపై మరో ముగ్గురు ఉ ద్యోగులపై వేటుపడింది. ఇప్పటికే షరాఫ్‌ గూ నాపు శ్రీను, అటెండర్‌ మోహనకృష్ణను కమిషనర్‌ భానుప్రతాప్‌ సస్పెండ్‌ చేయగా తాజాగా బాధ్యులుగా భావిస్తున్న మరికొందరిపై చర్యలు తీసుకున్నారు. నగరపాలక సంస్థ మేనేజర్‌ సీహెచ్‌వీవీఎన్‌ మూర్తి, అకౌంటెంట్‌ కేఎస్‌ఆర్‌ లింగేశ్వరి, సీనియర్‌ సహాయకుడు బీ1 సెక్షన్‌ క్లర్క్‌ ఓ.రవిలను సస్పెండ్‌ చేస్తూ జేసీ, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి అభిషేక్‌ గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అవకతవకలకు సంబంధించి దస్త్రాలు, అకౌంట్‌ పుస్తకాలు, ఇతరత్రా విలువైన దస్త్రాలను పరిశీలించి ప్రాథమిక దర్యాప్తు చేసేందుకు ఇద్దరిని ప్రత్యేకంగా నియమించారు. తణుకు, నూజివీడు పురపాలక సంఘాల నుంచి జూనియర్‌ అకౌంట్స్‌ అధికారు లు చిట్టిబాబు, రవిచంద్రను నియమిస్తూ ము న్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ నాగనరసింహారావు ఉత్తర్వులిచ్చారు. తక్షణమే ఏలూరుకు వెళ్లి విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా జిల్లాలో పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌లో జాతీయ నులిపురుగులు నిర్మూలన దినం ప్రా ముఖ్యతపై పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా లో 3,88,955 మందికి మాత్రల పంపిణీకి చ ర్యలు తీసుకున్నామన్నారు. ఈనెల 25న, అక్టోబర్‌ 5న నులిపురుగులు నివారణ మందు పంపిణీ లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు.

యలమంచిలి: కొంతేరు గ్రామానికి చెందిన సిస్టా జస్వంత్‌శ్రీ వచ్చే ఏడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో నాసా సౌకర్యాల్లో జరిగే అంతర్జాతీయ ఎ యిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారని తల్లిదండ్రులు వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాస్‌, సంగీత తెలిపారు. ఏఎక్స్‌ఏ ఏరోస్పేస్‌ నిర్వహించే ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థా యి అంతరిక్ష శిక్షణ, ప్రయోగాత్మక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం జస్వంత్‌కు లభించిందన్నారు. జస్వంత్‌ ప్రస్తుతం మహారాష్ట్రలోని నాసిక్‌లో శాండిప్‌ యూనివర్సిటీలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ రెండో ఏడాది చదువుతూ అంతరిక్ష వ్యవస్థలు, ఆస్ట్రోనాటిక్స్‌, ఆస్ట్రోఫిజిక్స్‌, క్వాంటం మెకానిక్స్‌తో పాటు ఉపగ్రహాల అభివృద్ధి, క్యూబ్‌శాట్‌ సాంకేతికత, ఎలక్ట్రానిక్స్‌ ప్రొపల్షన్‌ తదితర ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement