‘దీన్‌దయాల్‌’ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

‘దీన్‌దయాల్‌’ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

Aug 18 2026 7:28 AM | Updated on Aug 18 2026 7:28 AM

‘దీన్‌దయాల్‌’ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

భీమవరం: విద్యార్థుల్లో తపాలా బిళ్లల సేకరణ పట్ల ఆసక్తి పెంపొందించడానికి పోస్టల్‌శాఖ దీన్‌దయాల్‌ స్పర్శ యోజన స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు భీమవరం పోస్టల్‌శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతిలో 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుందన్నారు. ప్రతి తరగతి నుంచి 10 మంది విద్యార్థులను ఎంపికచేసి ప్రతినెల రూ.500 చొప్పున స్కాలర్‌షిప్‌ అందజేస్తారన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దగ్గరలోని పోస్టాఫీసు నుంచి దరఖాస్తును పొంది సెప్టెంబర్‌ 16లోగా భీమవరం డివిజన్‌ పోస్టాఫీసుకు స్పీడ్‌ పోస్టు ద్వారా పంపించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement