డీఎస్సీలో అనర్హులకు అందలం | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీలో అనర్హులకు అందలం

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

రావుల చెరువు.. అక్రమాల దరువు ఆక్వారంగం బలోపేతానికి కృషి

న్యూస్‌రీల్‌

డీఎస్సీలో మోసపోయాను

సీబీఐ విచారణ జరపాలి

రావుల చెరువు.. అక్రమాల దరువు
అభివృద్ధి పనుల ముసుగులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో రామన్నగూడెం రావుల చెరువు వివాదాలకు నిలయంగా మారింది. 8లో u

అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

లోకేష్‌ తన పదవికి రాజీనామా చేయాలి

జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

ఆక్వారంగంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి సమస్యలను పరిష్కరించేందుకు ఆక్వా ప్రొఫెషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కృషి చేస్తోంది. 8లో u

ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. డీఎస్సీ అక్రమాలపై విచారణ, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలను డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కై కలూరులో..

పార్టీ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి పాలనలో అర్హులను కాదని పైరవీలు పొందిన అనర్హులు ఉద్యోగాలు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీపీ పెద్దిరెడ్డి రాము మాట్లాడుతూ, హెరిటేజ్‌ ఫ్యాక్టరీ కోసం విజయ డైరీని మూలనపెట్టారని ఆరోపించారు. దీక్షలు చేస్తున్న వారికి డీఎన్నార్‌ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.

ఏలూరులో..

టీడీపీ కూటమి సర్కారు నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేశారని.. డీఎస్సీ పేరుతో అక్రమాలకు పాల్పడి భారీగా సొమ్ములు జేబుల్లో వేసుకున్నారని ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ విమర్శించారు. ఏలూరులో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పార్టీ నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి ఆధ్వర్యంలో నిరాహారదీక్షలో మహిళ నేతలు పాల్గొన్నారు. జయప్రకాష్‌ సతీమణి సుజాత హాజరై మహిళలకు సంఘీభావం తెలిపారు.

జంగారెడ్డిగూడెంలో..

జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకులు జెట్టి గురునాథరావు ముఖ్య అతిథులుగా హాజరై దీక్షలను ప్రారంభించి, నల్ల కండువాలు కప్పి సంఘీభావం తెలిపారు. లోకేష్‌ తక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

దెందులూరులో..

పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతతో కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలపై నిజాయతీ నిరూపించుకోవడానికి సీబీఐ విచారణ జరిపించాలని, దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. లోకేష్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఉంగుటూరులో..

డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసగించిందని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు విమర్శించారు. శనివారం ఉంగుటూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడో రోజు దీక్షలో భీమడోలు, గణపవరం మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని దీక్షలు చేశారు. వాసుబాబు మాట్లాడుతూ డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఇంతవరకూ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని తప్పుపట్టారు.

కొయ్యలగూడెం మండలంలో..

కొయ్యలగూడెం త్రిబుల్‌ ఆర్‌ సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. మెగా డీఎస్సీ పేరుతో 50 వేల పోస్టులు భర్తీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం కేవలం 16 వేల పోస్టులకే పరిమితం చేసి దగా చేసిందని ఆయన విమర్శించారు. వెంటనే లోకేష్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కామవరపుకోటలో..

కొత్తూరు బస్టాండ్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద కామవరపుకోట మండల వైఎస్సార్‌సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్ష చేపట్టాయి. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్‌ కంభం విజయరాజు ముఖ్య అతిథిగా పాల్గొని, డీఎస్సీ ఉద్యోగాలకు రేటు కట్టి నిరుద్యోగుల భవిష్యత్తును అమ్మేశారని మండిపడ్డారు.

నేను ఎంఏ, బీఈడీ చదివాను. గత డీఎస్సీలో కష్టపడి చదవడంతో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ జరిగి కాల్‌ లెటర్‌ కూడా వచ్చింది. ఉద్యోగం ఇచ్చే సమయానికి మెరిట్‌ జాబితాలో నా పేరు లేదు. న్యాయం కోసం మంత్రి లోకేష్‌తో పాటు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నాలాంటి ఎంతోమంది మోసపోయిన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి.

– తగరం నాగరాజు, లింగపాలెం

నేను బీఎస్సీ, బీఈడీ చదివాను. డీఎస్సీలో ఎలాంటి అర్హత లేని వారికి స్పోర్ట్స్‌ కోటా పేరుతో ఉద్యోగాలు కట్టబెట్టడం వల్ల మాలాంటి మెరిట్‌ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అక్రమాలకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించి మోసపోయిన నిజమైన అభ్యర్థులను ఆదుకోవాలి.

– వెలగలేటి వెంకటేశ్వరరావు, కొత్తూరు, కామవరపుకోట మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement