మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు

చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు ర్వహించారు. ఆలయ ముఖమండపంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిపించారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.2,32,549 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిర్వహించిన ధర్మకర్తల మండలి సాధారణ సమావేశంలో పలు అభివృద్ధి పనుల టెండర్లకు ఆమోదం తెలిపినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్‌ రాజాన సత్యనారాయణ, ఆలయ సహాయ కమిషనర్‌, ఈఓ ఆర్‌వీ చందన వెల్లడించారు. స్వామివారి గర్భాలయ ద్వారాలకు వెండి తాపడం వేయడంతో పాటు, అన్నదాన భవనంలో భక్తుల సౌకర్యార్థం స్టీలు బల్లలు, వంటల తయారీకి స్టీమ్‌ సౌకర్యం కల్పించే పనులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది.

పారిజాతగిరిలో పూజలు : గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం వేకువజామున నుంచి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి మొదటి మార్గంలో భూవరాహ స్వామి దర్శనం అనంతరం భక్తులు ఏడు శనివారాల కాలినడక దీక్షలు ప్రారంభించారు. దీక్షాపరుల కోసం ప్రత్యేక ఉచిత దర్శనం, అష్టోత్తర పూజల నిమిత్తం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఉచిత అన్న ప్రసాద వితరణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement