తణుకు అబ్బాయి.. రష్యా అమ్మాయి | - | Sakshi
Sakshi News home page

తణుకు అబ్బాయి.. రష్యా అమ్మాయి

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

తణుకు అబ్బాయి.. రష్యా అమ్మాయి

తణుకు అర్బన్‌: తణుకు అబ్బాయి.. రష్యా దేశ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తణుకు పట్టణానికి చెందిన సిర్రా బ్రహ్మయ్య కుమారుడు జానకి రామ్‌ పాల్‌, రష్యా దేశానికి చెందిన అనస్తాసియా డానిలోవా వివాహం శనివారం స్థానిక వీకే ఫంక్షన్‌ హాలులో క్రైస్తవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం జానకి రామ్‌ పాల్‌ బైబిల్‌ కోర్సులో శిక్షణ పొందేందుకు రష్యా దేశానికి వెళ్లారు. అక్కడ అనస్తాసియా డానిలోవాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, అనంతరం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వారు కూడా అంగీకరించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement