డిజిటల్‌ రూపంలో కోయ, గిరిజన భాషలు | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ రూపంలో కోయ, గిరిజన భాషలు

Jul 22 2026 1:23 AM | Updated on Jul 22 2026 1:23 AM

డిజిటల్‌ రూపంలో కోయ, గిరిజన భాషలు

బుట్టాయగూడెం: గిరిజన భాషల పరిరక్షణ కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, ఏఐ టూల్‌ డెవలప్‌ చేసి కోయ, గిరిజన భాషలను డిజిటల్‌ రూపంలో పొందుపరుస్తున్నట్లు ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్‌ తెలిపారు. ఈమేరకు మండలంలోని కేఆర్‌పురం ఐటీడీఏలో మంగళవారం కోయభాష నిపుణులు, కోయ భాష అనువాదం వారితో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ కోయ భాష పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ప్రొఫెసర్‌ డాక్టర్‌ చిక్కాల నాగరాజు మాట్లాడుతూ భాష సంస్కృతితో ముడిపడి ఉందని, ఆ భాష అంతరించిపోతే సంస్కృతి కూడా అంతరించిపోతుందని అన్నారు. భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో డీడీ పి.జగన్నాథరావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జి. చంద్రకళ, డీవైఈఓ కె.రవిప్రసన్నకుమార్‌, ఏఎంఓ కె.శిరమయ్య, సీఎంఓ ఎస్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ ఏఎంఓ ఎం.రమణారావు, వైటీసీ మేనేజర్‌ ఇజ్రాయేల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement