తగ్గుతూ.. పెరుగుతూ గోదావరి | - | Sakshi
Sakshi News home page

తగ్గుతూ.. పెరుగుతూ గోదావరి

Jul 21 2026 12:59 AM | Updated on Jul 21 2026 12:59 AM

తగ్గుతూ.. పెరుగుతూ గోదావరి కలెక్టర్‌ను కలిసిన డీఆర్వో కేంద్ర నిరంకుశ విధానాలు వీడాలి సర్వీసులను క్రమబద్ధీకరించాలి

పోలవరం రూరల్‌: తగ్గుతూ పెరుగుతూ గోదావరి వరద ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 26 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి దిగువకు 29,500 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. సోమవారం ఉదయం వరద కొంత పెరిగినా సాయంత్రం నుంచి స్వల్పంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి నీరు చేరడం తగ్గడంతో వరద ప్రవాహం ఒకేలా కొనసాగుతోంది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా రెవెన్యూ అధికా రిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రీదేవి సో మవారం కలెక్టర్‌ కె.వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు జిల్లాలో కృష్ణప ట్నం–హైదరాబాద్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను ప దోన్నతిపై ఏలూరు డీఆర్వోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శ్రీదేవి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్‌ను కలిసి పూలమొక్క అందించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్‌, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో ఆందోళన నిర్వహించారు. ముందుగా ఫైర్‌స్టేషన్‌ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌ ప్రాంగణానికి చేరుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, నీట్‌ పేపర్‌ లీకేజీకి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలు విడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పవన్‌కుమార్‌, అక్షయ్‌ మాట్లాడుతూ 20 రోజులకు పైగా ఢిల్లీలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వవం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం నాయకులు శ్రీమన్నారాయణ, ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ నాయకులు కట్టా సత్యనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ నాయకులు ఆర్‌.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దశాబ్ధాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణం వద్ద ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, దీంతో దీర్ఘకాలంగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రిన్సిపాల్‌ టి.అశోక్‌కు అందజేశారు. విశ్వవిద్యాలయాల కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సంఘం ఉపాధ్యక్షుడు హీరాభట్టు, సంయుక్త కార్యదర్శి పి.ప్రశాంతి, సభ్యులు ప్రైమ్‌ బాబు, శ్రీరాముడు, బాబులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement