తప్పుడు కేసులకు అదరం.. బెదరం
కైకలూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా ఆత్మీయ సభ విజయవంతం కావడంతో తట్టుకోలేక కూటమి నేతలు పసలేని విమర్శలు చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చర్యకు ప్రతిచర్య అనే కోణంలో మాట్లాడిన మాటలకు కూటమి నేతలు పెద్ద రాద్దాంతం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు ఇంతకన్నా దారుణమైన పదాలతో హింసిస్తున్న సంగతి అందరికీ తెలుసన్నారు. కారుమూరి, ఏలూరు పార్టీ ఇన్‌చార్జి జేపీపై కేసులు నమోదు చేయడానికి కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పో రాడతామని, తప్పుడు కేసులకు తమ నాయకులు, కార్యకర్తలు బెదరరని ఘాటుగా స్పందించారు.
రౌడీయిజానికి అడ్డాగా కై కలూరు
ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే కై కలూరులో రౌ డీరాజ్యం, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయని, ఎమ్మెల్యే కా మినేని శ్రీనివాస్ వీటిని ప్రోత్సహిస్తున్నారని డీఎన్నార్ విమర్శించారు. ఇటీవల సంత మార్కెట్ వద్ద బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి దుకాణానికి ఇద్దరు రౌడీలు ఏకంగా తాళాలు వేశారన్నారు. కార్లు అడ్డంగా పెట్టి కక్కిన కూడుకు కక్కుర్తి పడినట్టుగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని ఓటు వేయకుండా అడ్డుకున్నారన్నారు. ఎమ్మెల్యే కామినేని బయట ఒక మాట, లోపల మరో మాట మాట్లాడుతున్నారన్నారు. తన కుటుంబానికి చెందిన చేపల చెరువులో చేపలను పట్టి అమ్ముకోవాలని రౌడీలకు ఆయనే చెప్పారని ఆరోపించారు. ఎమ్మెల్యే కామినేని వయసుకు గౌరవవిస్తామని, రౌడీయిజం, దౌర్జన్యాలను ప్రోత్సహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు. కై కలూరులో ఓ పోలీసు అధికారి కూటమి పార్టీ నాయకుల సొంత మనిషిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కూ టమి నేతల సిఫార్సులతో అక్రమ కేసులు నమోదు చేయకుండా పోలీసులు విధులు నిర్వహించాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీ సయ్యపురాజు గుర్రాజు, జిల్లా అధికార ప్రతినిథి మోట్రూ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
చర్యకు ప్రతిచర్య కోణంలోనే కారుమూరి వ్యాఖ్యలు
జిల్లా ఆత్మీయ సభ సక్సెస్‌నుతట్టుకోలేక కూటమి నాయకుల విమర్శలు


