చికిత్స పొందుతూ వ్యవసాయ కూలీ మృతి
పెద్దాపురం: కాండ్రకోట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ సిద్దారెడ్డి త్రిమూర్తులు (57) కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. బాధితులు, పోలీసుల కథనం మేరకు ఈ నెల 7న సిద్దారెడ్డి త్రిమూర్తులు గోడకు సున్నం వేస్తూ నిచ్చినపై నుంచి జారి పడ్డాడు. జారిపడిన త్రిమూర్తులు తొడ ఎముక విరిగి, మెడకు బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన అతని కుటుంబ సభ్యులు పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళుతుండగా ప్రథమచికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు.అపస్మారక స్థితిలో ఉన్న త్రిమూర్తులకు వైద్యలు చికిత్స కొనసాగించినా ఫలితం లేకపోయింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కూరగాయల ధరవరలు ఇలా..
కూరగాయలు హోల్‌సేల్ రిటైల్
(కిలోల్లో) (రూ.లలో) (రూ.లలో)
పాత ఉల్లి 53 60
కొత్త ఉల్లి 45 50
తెల్ల వంకాయలు 70 80
నల్ల వంకాయలు
మొదటి రకం 50 60
నల్ల వంకాయలు
రెండో రకం 60 70
చిక్కుడుకాయలు 120 140
దొండకాయలు 50 60
క్యారెట్ 60 70
బీరకాయలు 60 70
ములక్కాయలు 100 120
ఆకాకరకాయలు 120 140
బెండకాయలు 60 70
ఆనపకాయ (ఒకటి) 40 45
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
● కార్తికం, తుపానులు, ఎల్‌నినో ప్రభావంతో ధరలకు రెక్కలు
● సామాన్యులకు భారమవుతున్న కొనుగోళ్లు
ద్వారకాతిరుమల: కార్తికమాసం వచ్చిందంటే చాలామంది శాకాహారానికే ప్రాధాన్యమిస్తారు. దీంతో సహజంగానే కూరగాయలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ పరిస్థితికి తోడు ఈ ఏడాది వరుస తుపాన్లు, ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో కూరగాయల దిగుబడి బాగా తగ్గి డిమాండ్ పెరిగి ధరలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మార్కెట్లలో కూరగాయలు కొనాలంటే సామాన్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గతంలో కిలోల కొద్దీ కొనుగోలు చేసిన కూరగాయలను ప్రస్తుతం అర కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
సగానికి పైగా పెరిగిన ధరలు..
కార్తికమాసానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని రకాల కూరగాయల ధరలు సగం కంటే ఎక్కువగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లోనే ధరలు అధికంగా ఉండడంతో రిటైల్ వ్యాపారులు కూడా అదనపు ధరలకు విక్రయించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
కొనాలంటే ఆలోచించాల్సిందే..
రోజు కూలీలు, చిరుద్యోగులు, మధ్య తరగతి కుటుంబాలపై కూరగాయల ధరల ప్రభావం తీవ్రంగా పడుతోంది. నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల కొనుగోలుకూ అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. గతంలో రూ.100తో సంచినిండా కూరగాయలు కొనుగోలు చేసేవారమని, ప్రస్తుతం అదే మొత్తంతో రెండు మూడు రకాలకే పరిమితం కావాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. తుపాన్ల ప్రభావం తగ్గి పంట దిగుబడులు పెరిగితేనే ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
కొబ్బరి రకం ధర (రూ.)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000
కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 23,500
గటగట (వెయ్యి) 21,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 22,500
గటగట (వెయ్యి) 20,000
నీటికాయ
పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 18,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)17,000 – 18,000
కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000
కిలో 350
పంటలకు తుపాన్ల దెబ్బ
ఇటీవలి అర్నబ్, మురసు తుపానుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కూరగాయల సాగుకు తీవ్ర నష్టం వాటిల్లడంతో మార్కెట్‌కు వచ్చే దిగుబడులు తగ్గిపోయాయి. మరోవైపు వర్షాల వల్ల కోతలు, రవాణాలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా మార్కెట్‌లో కూరగాయల లభ్యత తగ్గి ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆకుకూరల పరిస్థితి కూడా అలానే ఉందని అంటున్నారు.


