ముగిసిన జెఎన్టీయూకే
స్థాయి క్రీడలు
గుడ్లవల్లేరు: స్థానిక శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న జెఎన్టీయూకే స్థాయి అంతర్ కళాశాలల పోటీలు ఆదివారంతో ముగిశాయి. టోర్నీలో వర్సిటీ పరిధిలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 350 మంది క్రీడాకారులు, 50 మంది ఫిజికల్ డైరెక్టర్లు, సెలక్షన్ కమిటీ మెంబర్లు హాజరయ్యారు. ఈ క్రీడల్లో టేబుల్ టెన్నిస్లో జెఎన్టీయూ కాకినాడ తృతీయ స్థానం సాధించింది. అనంతరం వర్సిటీ జట్లను ఎంపిక చేశారు. ఎంపికై న టీటీ జట్టు డిసెంబర్ 7 నుంచి 12 వరకు వీఆర్ సిద్ధార్థ యూనివర్సిటీ విజయవాడలో జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొంటారు.


