వైఎస్సార్‌ సీపీలోకి వరుస చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి వరుస చేరికలు

Nov 16 2026 12:14 AM | Updated on Nov 16 2026 12:14 AM

అనపర్తి: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుస చేరికలతో వైఎస్సార్‌ సీపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. శనివారం రాత్రి అనపర్తి మండలంలోని చిన పొలమూరు దేవస్థానం కాలనీ యువజన నాయకుల సమక్షంలో పలువురు వైఎస్సార్‌ సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేడిశెట్టి ఉమ, చిట్టూరి వెంకటేష్‌, చిట్టూరి నాగరాజులతో పాటు యువకులు పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు, ఉప సర్పంచ్‌ అభ్యర్థి నల్లమిల్లి వెంకటరెడ్డి (నేషనల్‌), మురళి, సత్తి వెంకట రామారెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ సత్తి రామకష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, టౌన్‌ అధ్యక్షుడు నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, కొండేటి భీమేష్‌లతో బాటు మహాలక్ష్మిపేట, సావరం, చిన్న పొలమూరు, దేవస్థానం కాలనీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement