ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణనాథుని చవితి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే తమ ప్రత్యేకతను, భక్తిని చాటుతున్నారు. ఆదుర్రు శివారు మోరిపొలంలో 34వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా లంబోదరుడికి 250 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి ఔరా అనిపించారు. తొలుత శ్రీగణేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు చేశారు. అదే గ్రామంలోని ప్రధాన కూడలి రామాలయం వద్ద మహిళల కోలాటం ఆకట్టుకుంది. జై గణేశా.. శరణు గణేశా అంటూ గణపతిని స్తుతిస్తూ చేసిన ఈ ప్రదర్శన భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
–మామిడికుదురు


