కళాకారులను గౌరవించడం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

కళాకారులను గౌరవించడం అభినందనీయం

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

చాగల్లు: కళలను, కళాకారులను గౌరవించడం అభినందనీయమని సినీనటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. చాగల్లు తెలగా సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ఆయన హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ చాగల్లు అంటే షుగర్‌ ఫ్యాక్టరీ అని, అలాగే దర్శకుడు వీవీ నాయక్‌ పేరు వినగానే చాగల్లు గుర్తుకొస్తుందన్నారు. అలాగే తాను తీసిన సినిమాలోని ‘ఈ ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా..’ అంటూ పాడి సభికులను ఉత్సాహపరిచారు. గంజాయి బాట పట్టవద్దని, అది జీవితాలను నాశనం చేస్తుందని అన్నారు. ఆర్‌.నారాయణమూర్తి, మంత్రి కందుల దుర్గేష్‌, ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణను దర్శకుడు వీవీ వినాయక్‌ సోదరుడు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రోతు సురేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, రాష్ట్ర సాంస్కృతిక కళా మండలి చైర్మన్‌ బుద్దాల వెంకట రామారావు, తెలగా సంఘ సభ్యులు జుట్టా కొండలరావు, మైలవరపు ఆదేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement