చినవెంకన్నకు రూ.92 లక్షల ఆభరణాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

చినవెంకన్నకు రూ.92 లక్షల ఆభరణాల సమర్పణ

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

ద్వారకా తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన వేగుంట సాంబశివరావు, సౌందర్యలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు రూ.92 లక్షల విలువైన బంగారు, వెండి కవచాలను బుధవారం సమర్పించారు. మొత్తం 584 గ్రాముల బంగారం, 507 గ్రాముల వెండితో తయారు చేయించిన కవచాలను ఆలయ చైర్మన్‌ ఎస్‌వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావులకు అందజేశారు. హస్తాలతో వక్షస్థల భాగాన్ని ఈ కవచాలపై రూపొందించారు. కార్యక్రమంలో ఈఈ డీవీ భాస్కర్‌, దాత కుటుంబ సభ్యులు చేవూరి లక్ష్మీనారాయణ, చేవూరి ఈశ్వర ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement