అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

రాయవరం: పాఠశాలల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,937 స్కూల్‌ అసిస్టెంట్‌, 3,597 ఎస్‌జీటీ పోస్టులు మంజూరు చేశారు. వాటిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 341 స్కూల్‌ అసిస్టెంట్లు, 147 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. అకడమిక్‌ ఇనస్ట్రక్టర్లను ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 2027 ఏప్రిల్‌ 30 వరకు 8 నెలల కాల పరిమితికి టెంపరరీ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. వీరిలో స్కూల్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్‌జీటీలకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం నేరుగా వారి ఖాతాలకు జమ చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపిక చేస్తారు. పూర్తిగా మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక చేయాలని, ఎంపిక ప్రక్రియను ఈ నెల 28వ తేదీలోపు పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపికై న అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు సెప్టెంబరు 1వ తేదిన విధుల్లో చేరాల్సి ఉంటుంది.

బ్యాంకుల మోసగాడు..

చివరకు చిక్కాడు

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ఆర్థిక నేరాలకు పాల్పడి బ్యాంకులను మోసం చేస్తూ, పోలీసులను తప్పించుకుంటూ తిరుగుతున్న కొవ్వూరుకు చెందిన కవల వెంకట నరసింహాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేక బృందం అరెస్ట్‌ చేసింది. రాజమహేంద్రవరం సీఐడీ రీజినల్‌ ఆఫీసర్‌, అడిషనల్‌ ఎస్పీ అస్మా ఫర్హీన్‌ శుక్రవారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. నిందితుడిని రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించారన్నారు. అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించనట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధం ఉన్న బ్యాంకు సిబ్బందిని గతంలోనే అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారన్నారు.

పలు బ్యాంకుల్లో మోసం

కవల వెంకట నరసింహం 2018 నుంచి 2020 మధ్య కొవ్వూరు పరిధిలోని వివిధ ఎస్‌బీఐ శాఖల్లో తప్పుడు పత్రాలు సమర్పించి, బ్యాంకు అధికారులతో కుమ్మకై ్క సుమారు రూ.11 కోట్ల మేర రుణాలను వివిధ వ్యక్తుల పేర్లపై తీసుకున్నాడు. అనంతరం ఆ మొత్తాలను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, వాటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ మేరకు పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో నిందితుడిని సీఐడీ పోలీసులు ఢిల్లీలో కస్టడీలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువస్తున్న సమయంలో పారిపోయాడు. చివరకు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement