గండేపల్లి: అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పపడినట్టు ఎసై యూవీ శివ నాగబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలంలోని యల్లమిల్లికికి చెందిన జుత్తుక స్వర్ణకుమారికి (19) రెండేళ్ల క్రితం రంగంపేట మండలం ముకుందవరం గ్రామానికి చెందిన మందనక్క ప్రసాద్ కుమార్‌తో ప్రేమ వివాహమైంది. నాటి నుంచి ఆమె భర్త, అత్త, చిన మామగారు కలిసి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి పుట్టింటికి యల్లమిల్లి వచ్చిన ఆమెతో భర్త గొడవపడి వెళ్లినప్పటి నుంచి ఆమెను ముకుందవరం తీసుకు వెళ్లలేదన్నారు. నిత్యం వారు ఫోన్‌లో గొడవ పడేవారని మంగళవారం కూడా అదే జరగడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని స్వర్ణకుమారి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలియజేశారు. తహాసీల్దార్ శవ పంచనామ చేశారు. ఆమె తండ్రి జుత్తుక నూకరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు.


