మళ్లీ శాప్ అకాడమీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో రాష్ట్ర స్థాయి అకాడమీలను తిరిగి ప్రారంభిస్తుందని డిఎస్‌డీఓ వి.సతీష్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి శాప్ నుంచి ఆదేశాలు అందాయన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి వెయిట్ లిఫ్టింగ్‌లో 15, జిమ్నాస్టిక్స్‌లో 15, హాకీలో 20, ఖోఖోలో 20 మంది బాలికలకు ప్రవేశం కల్పించనున్నారు. 19 సంవత్సరాలలోపు వారు 1–1–2008 నుంచి 1–1–2011 మధ్య జన్మించిన వారు ప్రవేశానికి అర్హులు. ఎంపికై న వారికి కోచింగ్, వసతి, భోజన, ఆధునిక శిక్షణ సదుయాలు కల్పిస్తారన్నారు. విశాఖ, తిరుపతి, కాకినాడలో ఈ శాప్ అకాడమీలు ప్రారంభమవుతాయన్నారు. విశాఖలో అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్‌లో బాలుర, అకాడమీలు, తిరుపతిలో బాలురు, బాలికలకు జుడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిిఫ్టింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్‌లో అకాడమీలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. కాకినాడలో ఈ నెల 29న వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్‌లో, 30న హాకీ, ఖోఖోలో ఎంపికలు జరుగుతాయని తెలిపారు. వివరాలకు 9440031601 నంబరులో సంప్రదించాలని కోరారు.
పచ్చటి బతుకుల్లో కారుచిచ్చు


