● ఆందోళనలకు స్పందించని
యాజమాన్యంపై ఆగ్రహం
● వేదాంత జిఎం మను ఖన్నా
దిష్టిబొమ్మ దగ్ధం
● స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్
ఉప్పలగుప్తం: ఎస్.యానంలోని వేదాంత ఆయిల్ కంపెనీ (రవ్వ ప్లాంట్) ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు వంద ఉద్యోగాలు, గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న నిరసనలకు యాజమాన్యం స్పందించకపోవడంతో శుక్రవారం ప్లాంటు వద్ద ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదాంత కంపెనీ జీఎం మనుఖన్నా దిష్టిబొమ్మను దగ్ధం చేసి కంపెనీ గో బ్యాక్ అంటూ డిమాండ్ చేశారు. ధర్నాకి నాయకత్వం వహించిన నాయకులు మాట్లాడుతూ ఈ సంస్థ 15 ఏళ్లుగా గ్రామస్తులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, గ్రామాన్ని శ్మశానంలా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాంటు వల్ల కాలుష్యం పెరిగి పంట లు నాశనమయ్యాయని, ప్రజలు వ్యాధులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పెట్టా అప్పారావు, నీటి సంఘం చైర్మన్ దంగేటి చిట్టిబా బు, జోగి రాజా, లంకే భీమరాజు పాల్గొన్నారు.


