వారాహి మాతకు బంగారు హారం | - | Sakshi
Sakshi News home page

వారాహి మాతకు బంగారు హారం

Mar 14 2026 7:50 AM | Updated on Mar 14 2026 7:50 AM

పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన వారాహి మాతకు అమెరికాకు చెందిన గూగుల్‌ సంస్థ డైరెక్టర్‌ శేష సతీష్‌, ఆశాకిరణ్‌ దంపతులు సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు హారాన్ని శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ, వారాహి మాత దయతో తమ కుటుంబానికి మేలు జరిందని, కృతజ్ఞతగా ఈ హారం సమర్పించామని చెప్పారు. తన బంధువు, ఆలయ కమిటీ ప్రతినిధి సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి (చంటిబాబు) దంపతుల ద్వారా అమ్మవారి విశిష్టతను తెలుసుకున్నానన్నారు. దాత దంపతులకు ప్రధానార్చకులు నారాయణ నంబూద్రి, శుక్లా, రాంబాబు తదితరులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్తి భగవాన్‌రెడ్డి, కోశాధికారి డీఆర్‌కే రెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు), మండ రాజారెడ్డి, ప్రత్యూష మురళి, యువరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement