
అమలాపురం రూరల్: మస్కట్ దేశంలో చిత్రహింసలు పడుతున్న మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు క్షేమంగా ఇండియాకు రప్పించారు. తన భార్యను రప్పించాలని కొత్తపేటకు చెందిన సాక చంటి కలెక్టరేట్‌లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌లో ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాలతో మరియమ్మను ఇండియాకు రప్పించినట్టు డీఆర్‌ఓ, కేంద్ర నోడల్ అధికారి కొత్త మాధవి తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భర్త, ఇద్దరు బిడ్డలను విడిచి మరియమ్మ విదేశాలకు వెళ్లింది.
కోటిపల్లికి చెందిన వ్యక్తి కొంత సొమ్ము తీసుకుని ఈ ఏడాది జూన్ మూడున ఆమెను హైదరాబాద్ నుంచి మస్కట్ దేశానికి విమానం ఎక్కించాడు. అక్కడ పనిచేసే ఇంట్లో ఆమెకు సరైన భోజనం, వసతి కల్పించక, శారీరకంగా, మానసికంగా వేధించారు. దీనిపై ఆమె ఓ వీడియో విడుదల చేసింది. తన ఆరోగ్యం క్షీణిస్తుందని, అక్కడ ఉంటే చనిపోయే అవకాశం ఉందని సారాంశం. వెంటనే ఆమె భర్త చంటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కేసీఎం సిబ్బంది ఆ ఏజెంట్‌ను పిలిపించి, ఇరుపక్షాలను కూర్చోబెట్టి, మరియమ్మ ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేశారు.