కన్నబాబు ఇంట విషాదం | - | Sakshi
Sakshi News home page

కన్నబాబు ఇంట విషాదం

Aug 20 2025 12:30 PM | Updated on Aug 20 2025 12:41 PM

కన్నబ

కన్నబాబు ఇంట విషాదం

సాక్షి ప్రతినిధి, కాకినాడ/కాకినాడ రూరల్‌: వైఎస్సార్‌ సీపీలో అందరికీ బాబాయ్‌గా సుపరిచితులైన మాజీ మంత్రి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ(76) మృతి చెందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో విషాదం అలుముకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణను తొలుత కాకినాడ,హైదరాబాద్‌కు అక్కడి నుంచి తిరిగి కాకినాడలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ట్రస్టు ఆస్పత్రిలో కన్నుమూశారు. భౌతికకాయాన్ని పార్టీ నేతలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం వైద్యనగర్‌లోని కన్నబాబు ఇంటికి తీసుకువచ్చారు. సత్యనారాయణ భౌతిక కాయాన్ని చూసి కన్నబాబు తల్లి, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నిడదవోలు మండలం శెట్టిపేటకు చెందిన సత్యనారాయణ ఏజెన్సీలో స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు సోదరులు, ఇద్దరు తోబుట్టువులు, భార్య కృష్ణవేణి, కుమారులు కన్నబాబు, సురేష్‌బాబు, కళ్యాణ్‌ కృష ఉన్నారు. వీరిలో కన్నబాబు, సురేష్‌బాబు జర్నలిస్టులు, కళ్యాణ్‌ కృష్ణ సినీ దర్శకుడు.

ప్రముఖుల నివాళి
రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు తరలివచ్చి కాకినాడ వైద్యనగర్‌లోని కన్నబాబు స్వగృహం వద్ద సత్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద గల విజ్జపు రెడ్డి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా వైద్యనగర్‌లో నివాసం నుంచి ఊరేగింపుగా అంతిమ యాత్ర నిర్వహించారు. బంధువులు, పార్టీ అభిమానులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తండ్రి భౌతిక కాయానికి హిందూ సంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు కన్నబాబు అంత్యక్రియలు నిర్వహించారు.

కన్నబాబుకు పరామర్శ
కన్నబాబును జెడ్పీ చైర్‌పర్సన్లు విపర్తి వేణుగోపాలరావు, చిన్ని శ్రీను, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్‌, లేళ్ల అప్పిరెడ్డి, అనంతబాబు, పేరాబత్తుల రాజశేఖర్‌, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, వెల్లంపల్లి శ్రీనివాస్‌, గుడివాడ అమర్‌నాథ్‌, జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణు, తోట నరసింహం, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, అన్నంరెడ్డి అనుదీప్‌, పాముల రాజేశ్వరి, తిప్పల నాగిరెడ్డి, జి.శ్రీనివాస్‌ నాయుడు, తలారి వెంకట్రావు, పిల్లి అనంతలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, పిల్లి సూర్య ప్రకాశరావు, గన్నవరపు శ్రీనివాస్‌, పార్టీ నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీ నేతలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్‌, జమ్మలమడక నాగమణి, గుబ్బల తులసీకుమార్‌, కర్రి పాపారాయుడు, వట్టికూటి రాజశేఖర్‌, చెల్లుబోయిన శ్రీనివాస్‌, పిల్లంక శ్రీనివాసరాజు పరామర్శించారు.

 

కన్నబాబు ఇంట విషాదం1
1/5

కన్నబాబు ఇంట విషాదం

కన్నబాబు ఇంట విషాదం2
2/5

కన్నబాబు ఇంట విషాదం

కన్నబాబు ఇంట విషాదం3
3/5

కన్నబాబు ఇంట విషాదం

కన్నబాబు ఇంట విషాదం4
4/5

కన్నబాబు ఇంట విషాదం

కన్నబాబు ఇంట విషాదం5
5/5

కన్నబాబు ఇంట విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement