
భార్య పుట్టింటికి వెళ్లడమే కాకుండా తనతో సరిగా మాట్లాడడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య
హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లడమే కాకుండా తనతో సరిగా మాట్లాడడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ... ఫిలింనగర్‌లోని దుర్గాభవనీనగర్ బస్తీకి చెందిన పెద్ద నర్సింహా(29) వివాహం రెండేళ్ల క్రితం శివానీతో జరిగింది.
నాలుగు రోజుల క్రితం శివాని పుట్టింటికి వెళ్లింది. అత్త మాట్లాడినా సరిగా స్పందించలేదు. భర్తతో సైతం సరిగా మాట్లాడకపోవడంతో విరక్తి చెందిన నర్సింహా ఆదివారం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.