breaking news
young suicide
-
భార్యావియోగాన్ని తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లడమే కాకుండా తనతో సరిగా మాట్లాడడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ... ఫిలింనగర్‌లోని దుర్గాభవనీనగర్ బస్తీకి చెందిన పెద్ద నర్సింహా(29) వివాహం రెండేళ్ల క్రితం శివానీతో జరిగింది. నాలుగు రోజుల క్రితం శివాని పుట్టింటికి వెళ్లింది. అత్త మాట్లాడినా సరిగా స్పందించలేదు. భర్తతో సైతం సరిగా మాట్లాడకపోవడంతో విరక్తి చెందిన నర్సింహా ఆదివారం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
కడెం(ఖానాపూర్): మండలంలోని కొండుకూరు గ్రామానికి చెందిన మద్ది శ్రావణ్(24) గురువారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై అజయ్‌బాబు తెలిపిన వివరాలివీ..శ్రావణ్ మండలంలోని పాండ్వాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. కాని మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ప్రేమించిన అమ్మాయి గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి చెందిన యువకుడు మద్దిపడగ గ్రామసమీపంలోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుంటుంబీకులు అపస్మారక స్థితిలో ఉన్న యువకున్ని 108లో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి పోశవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రేమ విఫలమై.. యువకుడు ఆత్మహత్య
వరంగల్: ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం ఇటుకలపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైనందునే అతడు బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.