మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బస్సులో బయలుదేరి.. | Young Woman Missing In YSR District | Sakshi
Sakshi News home page

మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బస్సులో బయలుదేరి..

Oct 16 2022 7:29 PM | Updated on Oct 16 2022 7:29 PM

Young Woman Missing In YSR District - Sakshi

మధుభారతి(ఫైల్‌)

మధుభారతి గురువారం కడపలోని తన మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బస్సులో బయలుదేరింది.

అట్లూరు(వైఎస్సార్‌ జిల్లా): మండలంలోని లింగాలకుంట ఎస్టీ కాలనీకి చెందిన పేరూరు మధుభారతి (21) అనే యువతి అదృశ్యమైంది. ఎస్‌ఐ నాగ చిరంజీవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధుభారతి గురువారం కడపలోని తన మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బస్సులో బయలుదేరింది. ఆమె అక్కడికి చేరుకోకపోవడంతో.. బంధువులు, స్నేహితులను కుటుంబ సభ్యులు విచారణ చేశారు. ఎటువంటి ఫలితం లేకపోవడంతో  యువతి తల్లి గోపాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. ఇలా ఒక్కటయ్యారు.. ఆ పెళ్లిలో ఇదే ప్రత్యేక ఆకర్షణ   

Advertisement
 
Advertisement
Advertisement