సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఫాం హౌస్‌కు రమ్మన్నారు

Woman Molested Over Role In Hindi Movie - Sakshi

ముంబై : సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, వేధింపులకు పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరానలు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. లక్నోకు చెందిన ఓ యువతి కొద్దిరోజుల క్రితం హిందీ సినిమా ఆడిషన్స్‌లో పాల్గొంది. ఓ రోల్‌ కోసం ఆమె షార్ట్‌ లిస్ట్‌ అయింది. ఈ నేపథ్యంలో థానేలోని జీబీరోడ్డులో ఉన్న ఫాం హౌస్‌కు రావాలని గురువారం సినిమా వాళ్లనుంచి ఆమెకు ఫోన్‌ వచ్చింది. ముందుగా ఆమె వారు చెప్పిన ఓ ప్రదేశానికి వెళ్లగా.. ఓ కారులో ఫాం హౌస్‌కు తీసుకెళ్లారు. కారులో వెళుతున్నపుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు.

తమ కోర్కెలు తీరిస్తేనే సినిమా అవకాశం వస్తుందని చెప్పారు. ఫాం హౌస్‌కు వెళ్లిన తర్వాత ధైర్యం కూడగట్టుకున్న యువతి రహస్యంగా ఫాం హౌస్‌ లోకేషన్‌ను ఓ బంధువుకు, ఎమ్‌ఎన్‌ఎస్‌ పార్టీకి చేరవేసింది. అక్కడికి చేరుకున్న ఎమ్‌ఎన్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు నిందితులను పట్టుకున్నారు. శుక్రవారం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top