అత్త ప్రాణం తీసిన ‘కోడలి’ తగాదా | Woman Died In Mirpet | Sakshi
Sakshi News home page

అత్త ప్రాణం తీసిన ‘కోడలి’ తగాదా

Jun 5 2024 7:42 AM | Updated on Jun 5 2024 7:45 AM

Woman Died In Mirpet

    కూతురి గొడవలో తలదూర్చి వియ్యంకురాలిపై దాడి 

మీర్‌పేట: అత్తాకోడళ్ల మధ్య జరిగిన వివాదంలో కూతురుకు వత్తాసుగా నిలిచిన తండ్రి ఆవేశానికిలోనై వియ్యంకురాలిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాకు చెందిన జతావత్‌ ప్రభు (45) ఆటోడ్రైవర్‌. రెండేళ్ల క్రితం అల్మాస్‌గూడ వినాయకహిల్స్‌లో నివాసముండే కొర్ర జయరామ్‌కు తన కుమార్తె స్వాతిని ఇచ్చి వివాహం జరిపించాడు. కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

కుమార్తెను చూసేందుకు ప్రభు అతని భార్య శాంతితో కలిసి మంగళవారం వినాయకహిల్స్‌లోని అల్లుడి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కూతురు స్వాతి, అత్త లలిత (50)లు గొడవ పడుతుండగా ప్రభు మధ్యలోకి వెళ్లడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రభు పక్కనే ఉన్న ఇనుప సుత్తెతో లలితపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, నిందితుడు ప్రభును అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ గోవిందస్వామి తెలిపారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement