ట్రాఫిక్‌ పోలీస్ చొక్కా పట్టుకుని.. | Woman Attacks Traffic Police Over Heated Argument In Mumbai | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ పోలీస్ చొక్కా పట్టుకుని..

Oct 24 2020 4:03 PM | Updated on Oct 24 2020 4:24 PM

Woman Attacks Traffic Police Over Heated Argument In Mumbai - Sakshi

దాడి దృశ్యం

ట్రాఫిక్‌ పోలీసు చొక్కా పట్టుకుని దాడికి దిగింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న..

ముంబై : అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసుపై దాడికి దిగిందో మహిళ. ఈ సంఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మసీద్‌ బండార్ ప్రాంతానికి చెందిన సంగ్రికా తివారీ, భేండీ బజార్‌కు చెందిన మెహ్‌సిన్‌ షేక్‌లు స్నేహితులు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఓ పని మీద స్కూటీపై బయటకు వెళ్లారు. ఆ సమయంలో స్కూటీ నడుపుతున్న మొహ్‌సిన్‌కు హెల్మెట్‌ లేదు.  ద్విచక్ర వాహనం కాల్దాదేవీ ఏరియాలోని సూర్తీ హోటల్‌ వద్దకు రాగానే ట్రాఫిక్‌ పోలీస్‌ ఏక్తా పర్తే వారి వాహనాన్ని ఆపుచేశారు. హెల్మెల్‌ ధరించనందుకు ఫైన్‌ వేశారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు మహిళలకు, అధికారికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ( టీచర్‌కు బదులివ్వలేదని, కూతురిని )

దీంతో ఆగ్రహించిన సంగ్రికా.. అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటూ ట్రాఫిక్‌ పోలీసు చొక్కా పట్టుకుని దాడికి దిగింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ శాంతించని సంగ్రికా ఓ మహిళా పోలీసుపై కూడా చెయ్యి చేసుకోవటానికి ప్రయత్నించింది. దీంతో ఇద్దరినీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేసినందుకు గానూ వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement