కట్టుకున్న భర్తను హతమార్చి.. నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి.. | Wife Assassinated Her Husband In Prakasam District | Sakshi
Sakshi News home page

కట్టుకున్న భర్తను హతమార్చి.. నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి..

Jan 18 2022 11:04 AM | Updated on Jan 18 2022 11:11 AM

Wife Assassinated Her Husband In Prakasam District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదట ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. గత కొన్ని రోజులుగా భర్త అంజి మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు.

గిద్దలూరు(ప్రకాశం జిల్లా): కట్టుకున్న భర్తను తన భార్య హతమార్చిన సంఘటన గిద్దలూరు పట్టణంలోని ఏడో వార్డులో గల శ్రీరాంనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. ఈ సంఘటనలో మేకల చిరంజీవి అలియాస్‌ అంజి(32) తన ఇంట్లోనే మృతి చెందాడు. అందిన సమాచారం ప్రకారం.. శ్రీరాంనగర్‌కు చెందిన అంజి పట్టణానికి చెందిన అంకాలమ్మను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదట ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. గత కొన్ని రోజులుగా భర్త అంజి మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు.

చదవండి: పెళ్లి చూపులు ఇష్టం లేక.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

ఆదివారం అర్ధరాత్రి దాటాక పూటుగా మద్యం సేవించిన అంజి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. భర్త వేధింపులను తట్టుకోలేక అసహనానికి గురైన అంకాలమ్మ పక్కనే ఉన్న రోకలితో భర్తపై దాడి చేసింది. గాయాలతో పడిపోయిన భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించింది. అంజి శరీరం కాలిపోవడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అంకాలమ్మ నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన భర్తను తానే హత్య చేశానని చెప్పినట్లు తెలిసింది.  సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై స్థానికుల వద్ద ఆరాతీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement